
కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు(ఆర్ఎస్ఎస్) చేస్తున్న అరాచకాలపై సీపీఐ(ఎం) ఆరు బుక్లెట్లు విడుదల చేసింది. 'ఇండియాకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్' పేర.. జాతీయోద్యమంలో ఆ సంఘం వహించిన పాత్రతో మొదలు దేశంలో ఇటీవల చోటుచేసుకున్న బీఫ్ రాజకీయాల వరకు ఆర్ఎస్ఎస్ మతోన్మాద వైఖరులను ఈ బుక్లెట్లలో ఎండగట్టారు.