
మొన్న యుపిలో నిన్న బీహార్లో వరుసగా దెబ్బ మీద దెబ్బ తింటున్న బిజెపికి తాజాగా గుజరాత్లో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపాల్టీల్లో గట్టెక్కినా కీలకమైన పంచాయతీల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బుధవారం వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాల్లో గ్రామీణ గుజరాత్లో కాంగ్రెస్ అత్యధిక పంచాయతీలను గెలుచుకుంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రం బిజెపి తన పట్టును నిలుపుకుంది. మొత్తం ఆరు మున్సిపల్ కార్పొరేషన్లనూ అది చేజిక్కించుకుంది. జిల్లా, తాలుకా పంచాయితీల్లో మాత్రం కాంగ్రెస్ తన పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుచుకుంది.