
ఆవు రక్షణను రాజ్యాంగం నుంచి తొలగించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఐసిఎస్ఎస్ఆర్ హాల్లో డెమోక్రటిక్ కల్చరల్ ఫోరం ఆధ్యర్యంలో బుధవారం 'హోలీ కౌ- పాలిటిక్స్' అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.వందల ఏండ్ల ఇస్లాం పాలనలో పంది మాంసం తిన్నారన్న నెపంతో ఎవరిపైనా దాడులు జరగలేదని, హత్యలు జరగలేదని వివరించారు. మాదిగలు, ఆదివాసీలకు ఆవు, గేదె మాంసమే ప్రధాన ఆహారమని చెప్పారు. బైబిల్, ఖురాన్, భగవద్గీత, వేదాలలో ఎక్కడా ఆవు మాంసం తినొద్దని లేదని తెలిపారు. తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆవు మాంసం తినొద్దని, ఆవు గోమాత అన్న చర్చ కొద్దిగా నడిచిందన్నారు. మళ్లీ ఇప్పుడు నరేంద్రమోడీ రావడంతోనే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కాబట్టే ఇలా క్రూరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.