SFI మహాసభల లోగో..

ఎస్‌ఎఫ్‌ఐ 15వ అఖిల భారత మహాసభల లోగోను తయారు చేసి పంపాలని దేశంలో ఉండే చిత్ర లేఖనం అభిమానులకు ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ ఆహ్వానించింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని సికార్‌లో జనవరి 22నుంచి25వరకు ఈ మహాసభలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు వి.శివదాసన్‌, రితోబ్రతో బెనార్జీ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేశారు. నవంబర్‌ 20లోగా మహాసభల లోగోను డిజైన్‌ చేసి [email protected] కు పంపాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.దేశ నలు మూలల నుంచి వచ్చిన లోగో నమూనాల్లో విద్యార్థి ఉద్యమ చరిత్రను, ఎస్‌ఎఫ్‌ఐ ఔనత్యన్ని చాటి చెప్పేదిగా వుండేదానినఈ కమిటి ఎంపిక చేస్తుందని తెలిపారు.