
భారత మార్కెట్‌ను కొల్లగొట్టడానికే విదేశీ పెట్టుబడులకు ప్రధాని ఆహ్వానిస్తున్నారని సిపిఎం పేర్కొంది. పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడానికే ప్రభుత్వం ఎఫ్‌డిఐలకు లైసెన్స్ ఇచ్చిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో దేశంలోని పేదలకు దినసరి జీవనం గడవడమే గగనమైందని, ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.