సీపీఎం ప్లీనమ్ సమావేశాలకు వేదిక ఖరారైంది. డిసెంబర్ 27 నుంచి 31 వరకు కోల్కతాలో సమావేశాలు జరపాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణే లక్ష్యంగా కోల్కతాలోని చారిత్రక బ్రిగేడ్ పెరేడ్ మైదానంలో భారీ ర్యాలీకి కూడా పార్టీ అగ్రనేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.