
కీలకమైన రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లను అనుమతించటం ద్వారా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాన్నిఅమ్మకానికి పెట్టిందని సిపిఎం పొలిట్‌బ్యూరో విమర్శించింది. సింగిల్ బ్రాండ్ రిటైల్, బ్యాంకింగ్, నిర్మాణం, మీడియా, విమానయానం, రక్షణ తదితర 15 కీలక రంగాలలో ఎఫ్‌డిఐలను అనుమతించటాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది..