
బిహార్ ఫలితాలు ఎన్డీయే కూటమిలో చిచ్చుపెడుతున్నాయా? తాజా పరిణామాలను పరిశీలిస్తే ఔననే సమాధానం వస్తుంది. బిహార్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన హిందుస్థానీ ఆవామీ మోర్చా(హెచ్ఏఎం), లోక్ జనశక్తిపార్టీ(ఎల్జేపీ) నేతలు బీజేపీ, ఆరెస్సెస్ నేతల వ్యాఖ్యలే ఎన్డీయే ఓటమికి కారణమయ్యాయని సోమవారం ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమితషా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత వ్యాఖ్యలు ఎన్డీయేని ఓటమి దిశగా నడిపించాయని హెచ్ఏఎం అధినేత జితిన్ రాం మాంఝీ ఆరోపించారు.