
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్దులు ఈసారి తమ ప్రాతినిధ్యం పెంచుకున్నారు. సీపీఐ ఎంఎల్ అభ్యర్ధులు మూడు చోట్ల విజయం సాధించారు. దరౌలీ, బలరామ్‌పూర్, జిరదై అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఇంతకు ముందు సీపీఐ ఎంఎల్‌కు బీహార్ అసెంబ్లీ ప్రాతినిధ్యం లేదు. పశ్చిమ బీహార్‌లోని దరౌలీలో ఎంఎల్ అభ్యర్ధి 13 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. బలరామ్‌పూర్‌లో సీపీఐ ఎం ఎల్ అభ్యర్ధి మెహబూబ్ అలీ 22 వేల కోట్ల మెజారీటీతో గెలుపొందారు. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మెహబూబ్ అలీ 2500 కోట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి నెగ్గిన అభ్యర్దే ఇప్పబడు జేడీయూ అభ్యర్ధిగా బరిలోదిగారు. జిరదైలో అమర్జిత్ కుష్వాహా నెగ్గారు. కొన్ని చోట్ల వామపక్షాలు రెండో స్థానంలో నిలిచాయి.