కేరళ ప్రజలకు సిపిఎం అభినందనలు

కేరళ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు విజయం కట్టబెట్టిన కేరళ ప్రజలను సిపిఎం అభినందించింది. ఈ ఎన్నికల తీర్పుతో, యుడిఎఫ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక రికార్డును, అవినీతిని ప్రజలు తిరస్కరించినట్లైందని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. అలాగే బిజెపి మతోన్మాద రాజకీయాలను కూడా ప్రజలు తోసిపుచ్చారని, కుల ప్రాతిపదిక సంఘాల నాయకులను కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు నిర్ద్వం ద్వంగా తోసిపుచ్చారని ఈ తీర్పుతో వెల్లడైందని పేర్కొంది.