
హిందూత్వ వాదుల 'బీఫ్' వివాదం తారా స్థాయికి చేరింది. బీఫ్ తింటే తల నరికేస్తానని, దాంతో 'ఫుట్బాల్' ఆడుకుంటానని సీనియర్ బిజెపి నేత ఒకరు ఏకంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే హెచ్చరికలు జారీ చేశారు.బిజెపి షిమోగ జిల్లా కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడ్యూరప్పకు అతి సన్నిహితుడు చన్నబసప్ప మాట్లాడుతూ పై హెచ్చరికలు జారీ చేశాడు.