
న్యూఢిల్లీ : ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య పెద్ద తేడా లేదని ప్రముఖ మేధావులు విమర్శించారు. స్వేచ్ఛగా జీవించే హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాల్సిందిగా వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. 2013 ఆగస్టులో పూనెలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దాభోల్కర్ జన్మదినోత్సన్ని పురస్కరించుకొని 'ప్రతిఘటన' పేరుతో పలువురు రచయితలు, కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు.