సిపిఎం నేత హలీమ్‌ కన్నుమూత

కోల్‌కతా : సిపిఎం ప్రముఖ నేత, బెంగాల్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ హషిమ్‌ అబ్దుల్‌ హలీమ్‌ (80) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. 1982 నుండి 2011 వరకు అంటే 29ఏళ్ళ పాటు నిరాటంకంగా బెంగాల్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన రికార్డు కామ్రేడ్‌ హలీమ్‌ సొంతం. అసెంబ్లీ సభ్యులతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించిన హలీమ్‌ తొలుత లాయర్‌గా తన కెరీర్‌ను ప్రారంభి ంచారు. కాగా హలీమ్‌ మృతి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో విచారాన్ని వ్యక్తం చేసింది.