మతోన్మాదం ప్రమాదకరం:షారుఖ్

ముంబయి : తన యాభయ్యవ జన్మదినం నాడు బాలీవుడ్‌ సూపర్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ దేశంలో పెరుగుతున్న అసహన ధోరణులపై స్పందించారు. ఈ దేశంలో లౌకికవాది కాకపోవడం అన్నింటికన్నా ఘోరమైన నేరమని ఆయన అన్నారు. ఇటీవల వివిధ మేధో రంగాలకు చెందిన వారు, పెరుగుతున్న మతతత్వ సంఘటనలకు నిరసనగా అవార్డుల్ని వాపస్‌ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించగా, దేశంలో అసహనం విపరీతంగా పెరిగిందని షారూఖ్‌ అన్నారు. అవార్డుల్ని వెనక్కి ఇస్తున్న ఫిల్మ్‌మేకర్లు, శాస్త్రజ్ఞులు, రచయితలు, కళాకారులు ధైర్యవంతులని అన్నారు.