
ఓటుకు నోటు కేసులో ప్రధానమంత్రి దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఒక్కటయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ...సహారా కేసు విషయంలో 90 ప్రశ్నలకు కెసిఆర్ సమాధానం చెప్పాల్సి ఉండగా ఎందుకు నోరు మెదపట్లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ వాస్తవాలను బయటపెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆశాల సమ్మె వెనుక ఆంధ్రా కుక్కలున్నాయని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి నోరు పారేసుకున్నారని, అదే ఆంధ్రా సిఎం చంద్రబాబు మీద కేసు పెట్టే దమ్మూ ధైర్యం ఈ మంత్రులకు ఎందుకు లేదని ప్రశ్నించారు.