
సమాజ శ్రేయస్సు, లౌకిక విలువల కోసం కృషి చేసే సాహితీవేత్తలకు కేంద్ర మంత్రులు రాజకీయాలు అంటగట్టడం దురదృష్టకరమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. 'దేశంలో గొప్ప మేధావులుగా గుర్తించినవారికి పతకాలిచ్చారు. అలాంటి వారి చైతన్యాన్నీ, తెలివితేటల్నీ అవమానించడం సరికాదు' అని ఆయన అన్నారు. విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్న బిజెపి నేతలను ఆక్షేపించకుండా సాహితీవేత్తలపై విమర్శలు చేస్తున్నారని మంత్రులను దుయ్యబట్టారు.