నానాటికీ చుక్కలకెగబాకుతున్న పప్పుల ధరలు పోషకాహారాన్ని పేదలకు అందని మానిపండులా మార్చివేస్తున్నాయని సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది. రిటైల్‌గా కిలో రు.220 పలుకుతున్న కందిపప్పు చికెన్ కన్నా అత్యంత ఖరీదయిన వస్తువుగా మారిపోయిందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ అన్నారు.