
ఇంటర్‌నెట్‌ను అందరికీ ఉచితంగా అందించడం సాధ్యంకాదని భారత పర్యటనలో ఉన్న ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకెర్‌బర్గ్ బుధవారం ఢిల్లీ ఐఐటి విద్యార్థులతో ముచ్చటిస్తూ ఇంటర్‌నెట్ న్యూట్రాలిట ీ(తటస్థత)కి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా నెట్ తటస్థత ఉండాలని, అదే సమయంలో ప్రజలందరికీ ఇంటర్‌నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.