మార్కెట్లలో ఫెడ్‌ భయాలు..

ముంబయి : అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచనుందన్న మరోమారు ఊహాగానాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒత్తిడికి గురి అయ్యాయి. సోమవారం తొలి గంటలో లాభాల్లో సాగిన మార్కెట్లు అనంతరం మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో నష్టాల వైపు సాగాయి. మంగళవారం నుంచి ఫెడ్‌ సమావేశాలు జరుగనున్నాయని, ఇందులో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని వచ్చిన వార్తల నేపధ్యంలో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 109 పాయింట్లు కోల్పోయి 27,362కు దిగజారింది.