
అమరావతి శంకుస్థాపనకు పిలవొద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలనుండి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.జగన్ కలియుగ భస్మాసురుడని, జగన్ చేతిని తననెత్తినే పెట్టుకుంటున్నారని పయ్యావుల విమర్శించారు. శంకుస్థాపనకు కేసీఆర్ రావడం చంద్రబాబు చాణిక్యతకు నిదర్శనమని ఆయన చెప్పారు. విద్వేషాలు మర్చిపోయి కలిసి పయనించడమే తెలుగుజాతి ముందున్న లక్ష్యమని ఎమ్మెల్సీ పయ్యావుల చెప్పారు. శంకుస్థాపనకు జగన్ రాకపోవడం దురదృష్టకరమని ధూళిపాళ్ల అన్నారు. విపక్ష నేతగా జగన్ పనికిరారని ఆయన చెప్పారు.