
బిసి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌లిమిటెడ్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం లో నిర్మించ తలపెట్టిన ఎరువులు, రసాయనాల కర్మాగారంపై గురువారం నాడు ఫార్సుగా ప్రజాబి ప్రాయ సేకరణ జరిగింది. ప్లాంటుకు సంబంధిం చి నామమాత్రపు వివరాలు కూడా ఇవ్వకుండా అభి ప్రాయాలు సేకరించడంపై తీవ్రస్థాయిలో విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమీప బంధువులకు ఈ ప్లాంటులో భాగస్వామ్యం ఉండటంతో హడావిడిగా ఈ తంతు ముగించా రన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ టెక్నాలజీ ఉపయోగిస్తారో, ఎవరి నుండిసాంకేతిక సహకారం తీసుకుంటున్నారో వంటి అంశాలను కూడా ప్రజల కు వివరించకపోవడం గమనార్హం.
ఇంటర్నెట్నుండి కాపీ ఈ కంపెనీ తయారు చేయించిన ఎన్వి రాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఇ ఐ ఎ) రిపోరు కూడా ఇంటర్నెట్ నుంచి కాపీ కొట్టిందేనన్న అభి ప్రాయం వ్యక్తం కావడం విశేషం. ప్రభుత్వ రంగ సంస్థ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ డేటాను మక్కిమక్కికి కాపీ కొట్టి తాము చెప్పింది వినే కన్స ల్టెన్సీ ద్వారా రిపోర్టు తయారు చేయించారని ప్రతి ష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేసిన డాక్టర్ బాబూరావు చెప్పారు. కంపెనీ రూపొందించిన ఇఐఎ రిపోర్టును అధ్యయనం చేసి ఆయన అనేక అభ్యంతరాలను లేవనెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న జర్మనీకి చెందిన బిఐఎస్ఎఫ్ వంటి పెద్ద కంపెనీలే యూరియా ప్లాంట్లను వదిలించుకునే ప్రయత్నం చేస్తుంటే విబిసి యాజమాన్యం ఏ ధైర్యంతో ముందుకు వస్తోందని ఆయన ప్రశ్నించా రు.