
పర్యావరణ అనుమతులకు ఆమోదం లభించకుండా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో ఎలాంటి పనులూ(నేల చదును, నిర్మాణాలు చేపట్టడం) చేయకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జిటి) ఆదేశాలిచ్చింది. అలాగే నూతన రాజధాని ప్రాంతంలోని చిత్తడి నేలలు, ముంపు ప్రాంతాల గుర్తింపుపై పూర్తి నివేదికను తమకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపాదిత రాజధాని నిర్మాణ స్థలంలోని ముంపు ప్రాంతాలకు సరిహద్దులు నిర్ణయించాలని సూచించిన ట్రిబ్యునల్... అందులో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.