
దాద్రీ ఘటనపై దేశ రాజధానిలోని విద్యార్థిలోకం కదం తొక్కింది. జెఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, జామియా వర్సిటీలకు చెందిన విద్యార్థులు సుమారు 400 మంది విద్యార్థులు ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు మార్చ్ నిర్వహించాయి. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, ఎస్‌ఎఫ్‌ఐ, తదితర వామపక్ష, దళిత విద్యార్థి సంఘాలు ఈ నిరసనలో పాల్గొన్నాయి. ఫిరోజ్ షా రోడ్ కు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకొని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాద్రీ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని ఘటన వెనుక ఉన్న కుట్రదారులకు శిక్ష పడేలా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.