
ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన నిరవధిక దీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవల్స్, పల్స్ రేటు పడిపోవడంతోపాటు బరువు తగ్గుతున్నట్లు వైద్యులు నిర్ధారించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దీక్షా శిబిరానికి వచ్చిన జగన్ సతీమణి వైఎస్ భారతి జగన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.