
పశ్చిమ బెంగాల్ పోలీసులు అక్టోబర్ 1న జరిపిన లాఠీచార్జ్ విషయంలో ఐద్వా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ మహిళా కమిషన్‌కు ఐద్వా లేఖలు రాసింది. కోల్‌కతా జిల్లా లెఫ్ట్‌ఫ్రంట్ కమిటీ ఆధ్వర్యంలో లాల్‌బజార్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించగా పోలీసులు అకారణంగా లాఠీచార్జ్ చేశారన్నది తెలిసిందే. ఈ లాఠీచార్జ్‌లో చాలా మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారని ఐద్వా ఈ లేఖలలో వివరించింది. ఐద్వా అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి జగ్మతి సంగ్వాన్‌లు ఈ లేఖలను మీడియాకు విడుదల చేశారు.