
దాద్రీ ఘటన నేపథ్యంలో ఊరు విడిచి వెళ్లే ఆలోచన ఏదీ లేదని అఖ్లాక్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. బిషారా విడిచి వెళుతున్నట్లు వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చారు. 'మేము ఎక్కడి కీ తరలివెళ్లలేదు. వెళ్లము. దీనికి సంబంధించి వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యానికి గురయ్యాను' అని అఖ్లాక్ తనయుడు సర్తాజ్ వ్యాఖ్యానించారు. 'గ్రామం విడిచి వెళ్లడంపై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది మా సొంత ఊరు. మాతృభూమి. మేము ఇక్కడే పుట్టాం. ఇక్కడే తుది శ్వాస విడుస్తాం. మేమెందుకు గ్రామం విడిచివెళ్లాలి' అని సర్తాజ్ ఆవేదనతో వ్యాఖ్యానించారు.