
తమ ఇంట్లో దొంగతనం జరిగింది.. తమకు న్యాయం చేయండి అని పీఎస్ కు వెళ్లిన అని ఓ దళిత కుటుంబంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో జరిగింది. సునీల్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును స్టేషన్ లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. దాంతో ఎందుకు కేసు నమోదు చేయరో చెప్పాలని సునీల్ కుటుంభం ప్రవీణ్ ను నిలదీసింది. అంతే.... పోలీసు అధికారి ప్రవీణ్ కు కోపమొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనికి స్టేషన్ లో ఉన్న మరికొందరు పోలీసులు తోడయ్యారు. డ్రస్సులో ఉన్న పోలీసులు, డ్రస్సుల్లో లేని పోలీసులు అందరూ కలిసి ఒక్క సారి సునీల్ కుటుంబ సభ్యులు, బంధువుల మీద పడ్డారు. కొట్టుకుంటూ రోడ్డుమీదికి ఈడ్చుకొచ్చారు. సునీల్ భార్య చీరను లాగి పడేశారు. బట్టలు చించేశారు. అడ్డుపోయిన సునీల్ బట్టలు కూడా చించి పడేశారు. అడ్డుకున్న బంధువులను చితక్కొట్టారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ ʹఎఫ్ ఐ ఆర్ రాయాల్నా వద్దా అనేది నా ఇష్టం నన్నే ప్రశ్నిస్తారా ʹ అని బూతులు తిట్టుకుంటూ నగ్నంగా ఉన్న సునీల్ ను అతని భార్యను రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టాడు. వందలాది లాది మంది చూస్తుండగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్యపై, బంధులవులపై క్రిమినల్ కేసులు బనాయించి జైలుకు పంపారు.