పెచ్చుమీరుతున్న మతతత్వ శక్తుల ఆగడాలపై కలం యోధులు కలత చెందుతున్నారు. కేంద్రం ప్రకటించిన అరుదైన పురస్కారాలను సైతం తిప్పి పంపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నయన తార సెహెగల్ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును వెనక్కి పంపగా మరో కవి అశోక్ వాజ్‌పేయి కూడా అదే బాటను ఎంచుకున్నారు.