IMF పెదవి విరుపు..

భారత్ ఆర్థిక వృద్ధిరేటు ఆసక్తికరంగానే ఉన్నా.. సంస్కరణల అమలుపై ఐఎంఎఫ్ మరోసారి పెదవి విరిచింది. కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో సంస్కరణలు అమలు జరగటం లేదని పేర్కొంది. ఈ ఏడాది వృద్ధిరేటును కూడా గత అంచనా కంటే స్వల్పంగా తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై ఐఎంఎఫ్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా కనిపిస్తున్నా.. సంస్కరణలు అమలు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది. ముఖ్యంగా నిర్మాణ రంగాల్లో కీలకమైన ఎనర్జీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో రీఫామ్స్ సరిగా జరగడం లేదని పెదవి విరిచింది.