బెంగాల్లో లెఫ్ట్‌ హవా..

కొల్‌కతా: పురపాలక సంఘ ఎన్నికల్లో పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ కుట్రలు, దౌర్జన్యాలను ఎదిరించి బెంగా ల్‌లోని సిలిగురిలో వామపక్షాలు విజ యభేరీ మోగించాయి. ప్రజలు స్వచ్ఛం దంగా ఓటు వేసిన చోట తృణమూల్‌ పునాదులు కదిలిపోతాయని సిలిగురిలో మరోసారి రుజువైంది. సిలిగురి ఎన్నిక ల్లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ విజయాన్ని అడ్డుకోవ డానికి అధికార తృణమూల్‌తో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఎన్ని కుయుక్తు లు, కుతంత్రాలు పన్నినా వాటి తరం కాలేదు. సిలిగిరి ముహాకామా పరిషత్‌ లో 9 స్థానాలకు 6 స్థానాలు అంటే 70 శాతం సీట్లు గెలుచుకుని లెఫ్ట్‌ ఫ్రంట్‌ తిరుగులేని విజయం సాధించి ంది. సిలిగురి మహాకౌమ పరిషత్‌లో నాలుగు పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించ గా రెండు చోట్ల లెఫ్ట్‌ ఫ్రంట్‌ పూర్తి మెజార్టీతో జయకేతనం ఎగరవేసి ంది. మరో రెండు చోట్ల హంగ్‌ ఏర్పడింది. అయినా అక్కడ 
వామపక్షాలకే మొగ్గు వుంది.. అలాగే 22 గ్రామ పంచాయతీల్లో 10 స్థానాల్లో వామపక్షాలు విజయం సాధించగా, నాలుగు చోట్ల టిఎంసి, 8 చోట్ల హంగ్‌ ఏర్పడింది. హంగ్‌ ఏర్పడే అన్ని చోట్ల కూడా వామపక్షాలు ఇతరులతో కలసి పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి.