
ప్రభుత్వ రంగ పరిశ్రమలపై ప్రభుత్వ విధానాల కారణంగా ఏర్పడు తున్న సమస్యలపై ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. నర్సింగరావు పిలుపు నిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని సిఐటియు కార్యాల యంలో ఆదివారం పబ్లిక్ సెక్టర్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న నష్టాలను ఎలా ప్రతి ఘటించాలన్న అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేమి, ప్రయివేటీకరణ ముప్పు వంటి కారణాల వల్ల భవిష్యత్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. హిందుస్థాన్ షిప్‌యార్డు, హెచ్‌పిసిఎల్‌లో వాటాల విక్రయం ద్వారా ప్రయివేటు వారికి ప్రభుత్వం కట్టబెడుతుందని వివరించారు. విశాఖ పోర్టు ప్రయివేటీకరణలో భాగంగా ప్రస్తుత బెర్తులను కార్పొరేటీకరణ పేరుతో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.