
బ్రిటిష్ ప్రభుత్వం పాలిస్తున్నప్పుడే 1926లో మనదేశ కార్మికవర్గం పోరాడి, కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కును సాధించింది. కార్మిక సంఘాలనేవి ఏ దేశంలోనైనా ఉంటాయన్న స్పృహతో బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరించింది. అయితే కార్మిక సంఘాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం మాత్రం దారుణంగా వ్యవహరిస్తోంది.కార్మిక సంఘాలు, వామపక్ష ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షలపై చంద్రబాబు ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఫార్మా కంపెనీల యజమానులతో జరిగిన సమావేశంలో సంఘాలపైనా, ఉద్యమాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 'పాలనంటే బడాబాబులకు సాగిలపడడమా? ప్రజలను, కార్మికులను పట్టించుకోరా? అంటూ కార్మికులు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు.. బాబు వ్యాఖ్యలపై వివిధ కార్మిక సంఘాల నేతలు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.