
ఈ రోజు (28-9-2015)న మధ్యాహ్నాం పరవాడ జవహర్లాల్ ఫార్మాసిటీలో సాయినార్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించి ఇద్దరు మృతిచెందగా, మరో 5గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. గాయపడిన క్షతగాత్రులను విశాఖలోని న్యూ కేర్ ఆసుపత్రిలో పరామర్శిస్తున్న సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్, అధ్యక్షులు జి.కోటేశ్వరరావు.
ఈ ఘటనపై సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం మాట్లాడుతూ ఫార్మా కంపెనీల్లో కనీస భద్రతా చర్యలు కూడా పాటించకుండా అధిక ఉత్పత్తికి అధికవత్తిడి పెట్టడడమే ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తున్నది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఫార్మా యాజమాన్యాలు కానీ, ప్రభుత్వం గానీ కనీస భద్రతా చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నాయి. దీనివల్ల అమాయక కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సాయినార్ ఫార్మాలో రియాక్టర్లు పేలుడుల్లో శ్రీనివాస్, హరీష్‌కుమార్‌లు మృత్యువాతపడ్డారు. వీరి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. మరో 5 గురు తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ కుటుంబాలను యాజమాన్యం, ప్రభుత్వం ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు 30 లక్షలు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం. అలాగే మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నాం.
పరవాడ ఫార్మాసిటీలో ఈ రెండేళ్లలోనే సుమారు 6 భారీ ప్రమాదాలు సంభవించాయి. ప్రమాదం జరిగిన సందర్భంలో తూ.తూ. మంత్రంగా వ్యవహరించడం, మంత్రులు, ఎంఎల్ఏల హడావిడి పర్యటను చేసి తరువాత గాలికొదిలేయడం సర్వసాధారణమైపోతున్నది. నిబంధను పాటించకపోయినా, కాలుష్యంపై కలెక్టర్లు సైతం నోటీసులిచ్చినా, భద్రతా ప్రమాణాపై హెచ్చరికలు చేసినా ఫార్మా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. వీరిపై ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడమే ఈ ప్రమాదాలకు కారణం. గ్రీన్‌బెల్ట్‌ను సైతం అతిక్రమించి వసుధ`2 వంటి పరిశ్రము నిర్మాణాలు చేపడుతున్నా, వీటిపై చర్యలు తీసుకోవాలని కోరినా ఇప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా భద్రతా చర్యలు పాటించని, నిబంధలను అతిక్రమించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. సాయినార్ కంపెనీలో మృతులకు నష్టపరిహారం, క్షతగాత్రుకు మెరుగైన వైద్యం చేయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.