
దేశంలో జాతీయ అర్హత పరీక్ష(నెట్) యేతర ఫెలోషిప్‌ను రద్దుచేస్తూ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసి) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) సోమవారం ఢిల్లీలో యుజిసి ముట్టడి కార్యక్రమం తలపెట్టింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు పాల్గొని, యూజిసి లోపలకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఉద్రిక్తతకు దారి తీసింది. యుజిసి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వేలాది మంది విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.