
కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రాజ్యసభకు ప్రభుత్వం తెలిపింది. ఖాళీగా ఉన్న 6,02,325 ఉద్యోగాల్లో 5,33,081 గ్రూప్ ‘సీ’కి చెందినవని సిబ్బంది, ప్రజాసంబంధాలు, పింఛన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 51,478 గ్రూప్ ‘బీ’, 17,766 ఉద్యోగాలు గ్రూప్ ‘ఏ’ అధికారుల స్థాయికి చెందినవని పేర్కొన్నారు.