
కాంట్రాక్టర్లకు పారిశుధ్య పనులు అప్పగించే జీవో 279ని రద్దు చేయాలని కెవిపియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ జీవో అమలు చేయాలని గుంటూరు మున్సిపల్ ఆర్డీ ఆదేశించడం సిగ్గు చేటన్నారు. మున్సిపల్ కార్మికుల్లో 97 శాతం దళిత, గిరిజన ప్రజలే ఉన్నారన్నారు. వారికి ప్రభుత్వ అండ ఉంది అని చెప్పే పాలకులు వారి జీవితాలను ప్రైవేటు కాంట్రాక్టర్లకి అప్పగించడం దుర్మార్గమని ఆందో ళన వ్యక్తం చేశారు. జీవో రద్దు చేయక పొతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పారిశుధ్య కార్మికులు చేసే అందోళనలకు కెవిపియస్ మద్దతిస్తుందని, వీరికి దళిత, గిరిజన సంఘాలూ మద్దతివ్వాలని కోరారు.