10న దేశవ్యాప్త సమ్మె: దాస్ గుప్తా

న్యూఢిల్లీ : ఇపిఎఫ్‌ వినియోగదారులు విత్‌డ్రా చేసే మొత్తాలపై, యజమానులు చెల్లించే వాటాలపై పన్ను విధించాలన్న ప్రతిపాదనను బిఎంఎస్‌తో సహా కేంద్ర కార్మిక సంఘాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది కార్మిక వ్యతిరేక చర్య అని, ద్వంద్వ పన్నుల విధానానికి ఇదొక చక్కని ఉదాహరణ అని పేర్కొన్నాయి. ఇది కార్మికులపై దాడి చేయడం తప్ప మరొకటి కాదని ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి గురుదాస్‌ దాస్‌గుప్తా విమర్శించారు. ఇది పొదుపు చర్యల వ్యతిరేక ప్రతిపాదన అని పేర్కొన్నారు.