
ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్ల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం లేదని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని (భారత విద్యార్థి ఫెడరేషన్) ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభు త్వం తన వైఖరిని ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, నూర్‌మహమ్మద్ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు వైద్య విద్య వ్యాపారానికి మరింత అవకాశం ఇచ్చిన్నట్లు ఉందని భావించారు...