స్వయంప్రతిపత్తిలో జోక్యమెందుకు : సిపిఎం

జమ్మూ కాశ్మీర్‌కు గల ప్రత్యేక ప్రతిపత్తిని తుడిచిపెట్టేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే వున్నాయని, కానీ ఆ ప్రయత్నాలు ఎప్పుడూ ప్రతికూల ఫలితాలనే ఇస్తున్నాయని సిపిఎం నేత, ఎంఎల్‌ఎ మహ్మద్‌ యూసుఫ్‌ తరిగమి పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని కాజిగండ్‌లో బుధవారం జరిగిన పార్టీ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గులాం నబీ మాలిక్‌, ఇతర పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలో ఈ మేరకు హామీలు పొందుపరచినప్పటికీ జమ్మూ కాశ్మీర్‌ విషయంలో మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ మాత్రం తన ఎజెండాను రుద్దాలని చూస్తోందన్నారు.