సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రేప్‌ కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అత్యాచార కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రొత్సహించడం ఆమోదయోగ్యం కాదని బుధవారం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అలా చేయడం పెద్ద తప్పిదం అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పైగా అది మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని సుప్రీం స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మద్రాస్‌ హైకోర్టు రేప్‌ కేసులో నిందితుడికి బైయిల్‌ ఇచ్చింది. బాధితురాలితో మధ్యవర్తిత్వం కుదుర్చుకునేందుకు వీలుగా బెయిల్‌ ఇస్తున్నట్లు న్యామూర్తి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక అత్యాచార కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.