సీమలో సాగునీటి ప్రాజెక్టులపై శ్రద్ధ ఏది? : మధు

రాయలసీమ జిల్లాలకు అన్యాయం చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోరుతూ వామ పక్షాలు చేపట్టిన బస్సుయాత్ర సందర్బంగా మధు మాట్లాడుతూ, రాయలసీమలో ఏటేటా రైతు ఆత్మహత్యలు పెరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాల్లో తాగు, సాగునీరు లేదని, భూగర్భ జలాలు అడుగంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో హంద్రీ నీవా, గాలేరు నగరికి తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాయలసీమ జిల్లాలకు చెందిన ఆరుగురు ముఖ్య మంత్రులయినా గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయేముందు రాయలసీమ జిల్లాలకు విద్య, వైద్య రంగాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని ఉన్నా ముఖ్య మంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు.