సిపిఎం నేత రాఘవులను అడ్డుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ప్రభుత్వతీరు వివాదాస్పదమైంది. ఒంగోలులో అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆలస్యంగా హాజరయ్యారు. ఈ వేడుకలకు మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి శిద్దా రాఘవరావు హాజరుకాలేకపోయారు. దీంతో అప్పటి వరకు వేచి ఉన్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు రాఘవులును అడ్డుకున్నారు. మంత్రి శిద్దా రాఘవరావు వచ్చే వరకు ఆగాలని సూచించారు. అయినప్పటికీ రాఘవులు పోలీసులను ప్రతిఘటించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.