సనాతన్‌ సంస్థపై నిషేధం..

సామాజిక ఉద్యమకారులు, హేతు వాదులు, రచయితలపై దాడులకు పాల్పడుతున్న హిందూ అతివాద సనాతన్‌ సంస్థపై నిషేధం విధిం చాలని పలు రాజకీయ డిమాండ్‌ చేశాయి. సిపిఐ నేత,రచయిత గోవింద్‌ పన్సారే హత్య కేసులో నిందితుడైన సమీర్‌ గైక్వాడ్‌తోపాటు సనాతన్‌ సంస్థకు చెందిన మరికొందరు ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. ఐతే,నిందితులకు ఆ సంస్థతో సంబంధాలు న్నట్టు రుజువులు సాధించకుండా నిషేధం విధించాలని కేంద్రానికి ప్రతిపాదన పంపలేమని మహారాష్ట్ర హోంశాఖ అధికారులు తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద ఓ సంస్థపై నిషేధం విధించాలంటే..ఆ సంస్థ సభ్యులు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్టు తగిన ఆధారాలుండాలని అధికారులు పేర్కొన్నారు.