
శారద చిట్ ఫండ్ స్కాంపై వాస్తవాలు వెలువడినప్పటికి బిజెపి ఎందుకు మౌనం దాల్చిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ పక్షనేత సీతారామ్ ఏచూరి ప్రశ్నించారు. రాజ్యసభలో ఈ అంశంపై చర్చల్లో బిజెపి నోరు మెదపలేదని దుయ్యబట్టారు. మంగళవారం పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏచూరి మాట్లాడారు. భారత దేశ రాజకీయ చరిత్రల్లో ఇంత వరకు ఇలా జరగలేదని, ఒకే కుంభకోణంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, మేయర్లు భాగస్వామ్యం ఉందని ద్వజమెత్తారు. శారద చిట్ ఫండ్ కుంభకోణంలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని, ఈ అంశంలో టిఎంసి, బిజెపి మిలాఖత్ అయినట్లు తెటతెల్లం అయ్యిందని దుయ్యబట్టారు. తృణముల్ అవసరం బిజెపి కి ఉండటం చేత, తృణముల్‌ను రక్షించే పనిలో బిజెపి ఉందని ఎద్దేవా చేశారు.