లోక్ సభలో ఆధార్ రగడ..

ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్‌ కార్డును అనుసంధానించడాన్ని చట్టబద్దం చేయడానికి లోక్‌సభలో కేంద్రం ఆధార్‌ బిల్లును గురువారం ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎమ్‌.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ బిల్లు ఆమోదం పొందితే రూ.20 వేల కోట్ల వృథాని అరికట్టొచ్చని చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ కూడా ఎన్‌ఐడిఎఐ బిల్లుపేరుతో దీన్ని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నాయకుడు మల్లిఖార్జున్‌ ఖర్గే అన్నారు. దీనకి జైట్లీ వివరనిస్తూ 'ఇది కాస్త భిన్నమైంది. ఇది స్వతహాగా ప్రభుత్వ చెల్లింపులకు మాత్రమే పరిమితమౌతుంది' అని చెప్పారు.