లోక్‌సభలో ఎగవేతదారుల వివరాలు

ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొత్తం ఎగవేతల విలువ రూ. 64,334 కోట్లని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. రుణగ్రహీతలతో బ్యాంకు అధికారులు కుమ్మక్కైన కేసులు 115 అని శుక్రవారం ప్రభుత్వం వెల్లడి చేసింది. నిరర్థక ఆస్తుల అంశం ఒక ముఖ్య సవాలుగా ఉందని అంటూ, దీని పరిష్కారం కోసం బహుళ స్థాయిల్లో వేగవంతమైన చర్యలు తీసుకుంటు న్నామని ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అన్నారు. రూ. 25 లక్షలకు మించి రుణం తీసుకున్న ఉద్దేశపూరిత ఎగవేతదారులుగా 7,265 మందిని గుర్తించామని చెబుతూ, వారి వివరాలను సిన్హా సభలో వెల్లడి చేశారు.