రియల్ ఎస్టేట్ రాజధాని..

రైతులకు ప్లాట్లు ఇవ్వడం మొదలుపెట్టాక వాటితో వ్యాపారం చేయించేందుకు సిఆర్‌డిఎ సిద్ధమైంది. ప్లాట్లతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లతో చర్చలు చేపట్టింది.రైతుల భూముల అభివృద్ధికి ముందుకొస్తే బిల్డర్లకు సిఆర్‌డిఎ నుండి అవసరమైన సహాయం అందిస్తామని, సిఎంతో సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఇన్‌ఛార్జి కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రకటించారు. దీనికి అవసరమైతే చిన్న చిన్న ప్లాట్లు కలుపుకొని పెద్ద కమతాలుగా మార్చుకునేందుకు అవసరమైన నిబంధనలను సవరిస్తామని హామీ ఇచ్చారు. సింగపూర్‌ కన్సార్టియానికి భూములు కేటాయించే సమయంలోనే రైతుల భూములనూ బిల్డర్లకు కట్టబెట్టించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మొత్తం రాజధానిలో సిఆర్‌డిఎ వాటాకు వచ్చే భూములను సింగపూర్‌కు అప్పగించిన ప్రభుత్వం, రైతుల భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది.