
రాజధాని ప్రాంతంలో తుది మాస్టర్‌ప్లాను విడుదల అనంతరం భూముల కేటాయింపుపై మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రైతులకు కేటాయించే భూమి వివరాలతోపాటు, మొత్తం నగరంలో భూమిని దేనికి ఎంతవాడుతున్నారనే విషయాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. దీనిలో రాజధాని నగరంలో ఉన్న 53676 ఎకరాలకు సంబంధించిన వినియోగంపై స్పష్టత ఇచ్చారు. దీనిలో అన్ని రకాల నివాస ప్రాంతాలకు 16031 ఎకరాలను కేటాయించారు. వాణిజ్య ప్రాంతాలకు 6135 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. 2714 ఎకరాల్లో లాజిస్టిక్ జోన్ ఏర్పాటు చేయనున్నారు. గ్రీనరీలోని పాసివ్‌జోన్, యాక్టివ్ జోన్‌లకు 16,822 ఎకరాలు కేటాయించారు. ప్రభుత్వ జోన్‌కు 319 ఎకరాలు, ఎడ్యుకేషన్ జోన్‌కు 2342, ప్రత్యేక జోన్‌కు 1680, యుటిలిటీ జోన్‌కు 7625 ఎకరాలు కేటాయించారు..