
ముంబైలో శివసైనికులు మరోసారి రెచ్చిపోయారు. అబ్జర్వర్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుదీంధ్ర కులకర్ణిపై దాడికి దిగారు. శివసైనికులు సుదీంధ్ర ముఖానికి నల్ల రంగు పూశారు. పాకిస్థాన్ కు చెందిన విదేశాంగ మాజీ మంత్రి ఖుర్షీ మహ్మద్ కసూరీ రచించిన పుస్తకం ఆవిష్కరణను ముంబైలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని సుదీంధ్ర కులకర్ణి నిర్వహిస్తున్నారు. పాకిస్థానీ రచయిత పుస్తకావిష్కరణ ముంబైలో నిర్వహించ వీల్లేదని శివసేన హుకూం జారీ చేసింది. కాగా ఇదే విషయమై చర్చించేందుకు సుధీంధ్ర శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేను కలిశారు. వీరిరువురి చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శివసైనికులు సుదీంధ్ర ముఖానికి నల్లరంగు పులిమి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.