మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య 103వ జ‌యంతి సంద‌ర్భంగా

భారత కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుల్లో ఒకరైన కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య రేపల్లె మండం తూర్పుపాలెంలోని భూస్వామ్య కుటుంబంలో 1914 డిసెంబరు 14న జన్మించారు. తల్లిదండ్రలు చారుమతి, అప్పయ్య. భార్య జగదాంబ. కొద్దికాం సాంప్రదాయ బద్దమైన విద్యనభ్యసించారు. అనంతరం ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో చదివారు. బందరు నోబుల్‌ కళాశాలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. 1930లో దేశస్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన తరంతో ఆయన కలిసిమెసి పనిచేసి అనుభవాు పంచుకున్నారు. ఆనాడు కాంగ్రెస్‌ నాయకత్వం ఉద్యమాన్ని తాత్కాలికంగా రద్దు చేయటంతో అసంతృప్తి చెందిన కామ్రేడ్‌ బసవపున్నయ్య భారతదేశ ప్రజ సమస్యు సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే పరిష్కారం కాగవన్న ధృడమైన విశ్వాసంతో 1934`35లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. గుంటూరు ఎ.సి. కాలేజీలో బి.ఎ.చదివారు. గుంటూరులో జరిగిన విద్యార్థు సమ్మెకు నాయకత్వం వహించారు. గుంటూరులో సహవిద్యార్థులైన వై.వి.కృష్ణారావు, మాద నారాయణస్వామి, మోటూరు హనుమంతరావు, లావు బాగంగాధరరావుతో కసి రాష్ట్రంలో బమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి, 1938లో ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌ ప్రధానకార్యదర్శిగా బాధ్యతు నిర్వహించారు. అదేకాంలో అభి భారత విద్యార్థి ఫెడరేషన్‌ సహాయ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ఆయన 1940లో గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా బాధ్యతను స్వీకరించారు. 1943లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుగా ఎన్నికైనారు. 1948లో కకత్తాలో జరిగిన సి.పి.ఐ. ద్వితీయ మహాసభలో కేంద్ర కమీటికి ఎన్నికయ్యారు. 1964లో పార్టీ చీలిన తరువాత సి.పి.ఐ.(ఎం) పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. ఆ స్థానంలో నాుగు దశాబ్దా పాటు తుదిశ్వాస విడిచే వరకూ కొనసాగారు. విప్లవకర సిద్ధాతంమైన మార్క్సిజం`లెనినిజంకు చివరివరకు కట్టుబడి వుండి పీడిత ప్రజ విముక్తి కోసం విశిష్టమైన సేవందించారు. భారతదేశంలోనూ, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ వచ్చిన వక్రీకరణకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాటం సాగించారు. ‘‘నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట విశ్లేషణ’’ను చేయగలిగిన మార్క్సిజం`లెనినిజం అనే సజీవ సిద్ధాంత పతాకాన్ని సమున్నతంగా నిలిపేందుకు కృషి చేశారు. మార్క్సిజం`లెనినిజం సిద్ధాంత వ్యాప్తికి, భారతదేశ ప్రజ విముక్తికి గణనీయమైన సేవలందించారు. మహత్తర తెంగాణా రైతాంగ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన నాయకులో కామ్రేడ్‌ మాకినేని ఒకరు. తెంగాణా సాయుధ పోరాటంలో కామ్రేడ్స్‌ సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు మొదలైన ప్రముఖుతోపాటు కీక పాత్రను కామ్రేడ్‌ బసవపున్నయ్య పోషించారు. తెంగాణా పోరాట నిర్వహణకు అవసరమైన నిధు సమీకరణ, ఆయుధా కోనుగోలు, చేరవేతలో ప్రధాన భాధ్యత కామ్రేడ్‌ బసవపున్నయ్యదే. సాయుధ పోరాటాన్ని విరమించి విప్లవమార్గాన్ని చేపట్టటంలో కామ్రేడ్‌ సుందరయ్యతో పాటు కామ్రేడ్‌ బసవపున్నయ్య సృజనాత్మక పాత్ర నిర్వహించారు. ఈ కాంలో ఆయన భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగణ్యులైన నాయకులో ఒకరుగా ఎదిగారు. ఈ పోరాటంలో వచ్చిన అనుభవాు, రహస్య జీవనం సాగించిన కాంలో అనుభవాు, కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగించిన దమనకాండకు ఎదురొడ్డి నిలిచి పోరాడిన అనుభవా సాయంతో భారతదేశంలో విప్లవ సాధనకు అనుసరించాల్సిన వ్యూహం, ఎత్తుగడపై ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీలో చర్చను ప్రారంభించిన వారిలో కామ్రేడ్‌ మాకినేని ఒకరు. సిపిఎం విప్లవకర వ్యూహ్యాన్ని చేపట్టడంలో కామ్రేడ్‌ బసవపున్నయ్య కీల‌కపాత్రధారి. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో సిద్ధాంత పరంగా తీవ్రస్థాయిలో చర్చు సాగిన కాంలో ఈ అంశంపై అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుల‌తో చర్చు జరిపే బాధ్యతను పార్టీ కేంద్రకమిటీ కామ్రేడ్‌ మాకినేనికి అప్పగించింది. మాస్కోలో 1957లో జరిగిన ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ మహాసభల్లో పాల్గోనేందుకు వెళ్ళిన సి.పి.ఐ. ప్రతినిధి వర్గంలో ఆయన సభ్యులు. అప్పుడు దేశంలోనూ, అంతర్జాతీయంగానూ కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యపై మావోసేటుంగ్‌తోనూ, లీషావ్‌చి నాయకత్వంలో వచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందంతోనూ చర్చు జరిపే అవకాశం కామ్రేడ్‌ బసవపున్నయ్యకు వచ్చింది. శాస్త్రీయమైన, విప్లవకర మార్క్సిజం` లెనినిజం సిద్ధాతం పట్ల ప్రగాఢమైన నిబద్ధతతో కూడిన దేశభక్తి కామ్రేడ్‌ బసవపున్నయ్యలో నిండుగా ఉంది. భారత విప్లవ మార్గానికి స్వతంత్ర వ్యూహాను, ఎత్తుగడను అన్వేషించి భారత ప్రజకు విప్లవ మార్గాన్ని సూచించారు. ఆయన ఎ్లప్పుడూ ఈ రెండు అంశాను దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో విప్లవ సాధనకు వ్యూహాన్ని రూపొందించేవారు, భారతదేశంలో పీడిత ప్రజల‌ విముక్తి కోసం సైద్ధాంతికంగానూ, ఆచరణాత్మకంగానూ గణనీయమైన కృషి చేస్తూనే పార్లమెంటేరియన్‌గానూ రాణించారు. రాజ్యసభ సభ్యుడిగా 1952 నుంచి 1966 వరకు 14 ఏళ్లు కొనసాగారు. కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య రాజకీయ జీవితంలో ఆరేళ్లపాటు అజ్ఞాతవాసం సాగించారు. చైనా`భారత్‌ యుద్ధం సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయన్ను రెండుసార్లు జైల్‌లో పెట్టింది. ఈ కాంలో సి.పి.ఐ.(ఎం), కామ్రేడ్‌ మాకినేని చెప్పిన అంశాను ఆ తరువాత చాలా కాలానికి భారతదేశ పాకవర్గాు అంగీకరించాయి. చైనా భారతదేశా మధ్య వివాదాన్ని సంప్రదింపు, చర్చల‌ ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాల‌ని, ఘర్షణ ద్వారా కాదని చెప్పారు. సి.పి.ఐ.(ఎం) ఆవిర్భావం నాటి నుంచి చనిపోయే వరకూ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుగా పనిచేసిన కామ్రేడ్‌ మాకినేని పూర్వపు సోషలిస్టు దేశాల్లో సంభవించిన మార్పుకు సంబంధించి చేసిన సిద్ధాంతపరమైన సూత్రీకరణల్లో క్రీయాశీక పాత్ర నిర్వహించారు. 1990లో సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలి, సోషలిష్టు సిద్ధాంతంపైనే దాడి కేంద్రీకరించబడినా సడల‌ని కమ్యునిస్టు విశ్వాసాన్ని నిలిపిన ధీరుడు కామ్రేడ్‌ బసవపున్నయ్య. సి.పి.ఐ.(ఎం) అధికార పత్రిక పీపుల్స్‌ డెమోక్రసీ ఎడిటర్‌గా ఆయన 14 ఏళ్లు పనిచేశారు. సి.పి.ఐ.(ఎం) అభివృద్ధికి, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి వయసుతో నిమిత్తం లేకుండా అవిశ్రాంతంగా కృషిచేశారు. ఆయన మృతిచెందే నాటికి పార్టీ 14వ మహాసభ నిర్ణయానుసారం పార్టీ కార్యక్రమాన్ని నేటి పరిస్థితుకు అనుగుణంగా రుపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్‌ మాకినేని నిరంతరం చదివేవారు, విస్తృతంగా రాసేవారు. ఎంత గంభీరంగా ఉండేవారో అంత అప్యాయంగా మెలిగేవారు. కార్యకర్తులు, ఢల్లీి కార్యాయంలో ఉండే సిబ్బంది సంక్షేమం కోసం, వారి సమస్య పరిష్కారం కోసం పనిచేసేవారు. ఈ విశిష్టమైన గుణం ఉండటం వల్లే ఆయన్ను అందరూ ఎంతో అభిమానించేవారు. జాతీయ, అంతర్జాతీయ సమస్య‌లు సైద్ధాంతిక, వ్యక్తిగత సమస్యపై చర్చించేందుకు అయన అందరికీ ఎ్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. కామ్రేడ్‌ బసవపున్నయ్య మృతితో వర్గ శత్రువు పట్ల అత్యంత పదునుగాను, భారతదేశ ప్రజు, దేశభవిష్యత్‌ పట్ల అచంచ విశ్వాసంతోను సాగే ఒక పదునైన కలం ఆగిపోయింది. కామ్రేడ్‌ బసవపున్నయ్య గొప్ప ఉపన్యాసకు, సునిశితమైన రచయిత. అనేక సిద్ధాత పత్రాను రచించిన ఘనత ఆయనకుంది. ఆయనలో మార్క్సిస్టు`లెనినిస్టు సిద్ధాత పరిజ్ఞానంతో పాటు అంతర్జాతీయత, దేశభక్తి, తెలుగు జాతీయత కల‌గలిపి ఉండేవి. విప్లవోద్యమం కోసం కామ్రేడ్స్‌ సుందరయ్య, రాజేశ్వరరావు మున్నగువారితో సహా, తమ వ్యక్తిగత ఆస్తును అమ్మి పార్టీకి ఇచ్చినవారిలో కామ్రేడ్‌ బసవపున్నయ్య ఒకరు. కామ్రేడ్‌ బసవపున్నయ్య ఢల్లీిలోని పార్టీ కేంద్ర కార్యాయంలో పార్టీ పనిలో ఉంటూనే 1992 ఏప్రిల్‌ 12వతేది సాయత్రం అకస్మాత్తుగా మరణించారు. ఏప్రిల్‌ 14వ తేది సాయంత్రం ఆ మహనీయునికి విజయవాడలో కృష్ణానదితీరాన, వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తులు, అభిమానులు సమక్షంలో విప్లవ జోహార్ల నినాదాలు మారుమోగుతుండగా అంత్యక్రియు జరిగాయి. ఆయన అంకిత భావం, నిబద్ధత, నిరంతర విప్లవదీక్ష భావితరాకు ఆదర్శనీయం